InternationalNews

పాకిస్తాన్‌ ఓటమిపై మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

పాకిస్తాన్‌ క్రికెట్‌ టీంకు ఓ చెత్త కెప్టెన్‌ దొరకాడని పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు చెత్త  ప్రదర్శనతో కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌ భారత్‌ చేతిలో ఘోరంగా ఓటమిని చవి చూసింది. తర్వాతి మ్యాచ్‌లో పసికూన అయిన జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పాక్‌ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌పై షోయబ్‌ అక్తర్‌ పాక్‌ టీం ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాప్‌, మిడిలార్డర్‌తో పెద్ద విజయాలను సొంతం చేసుకోవచ్చునని పదే పదే చెబుతున్నా ఆటగాళ్ళకు ఎందుకు తెలియడం లేదని తన బాధను వ్యక్తం చేశాడు. కెప్టెన్‌ బాబార్‌ ఆజమ్‌తోపాటు మిగిలిన బ్యాట్స్‌మెన్స్‌ కూడా ఆర్డర్‌ను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. షాహీన్‌ షా అఫ్రిదిలో ఫిట్‌ నెస్‌ లోపించిందన్నాడు. కేవలం అవతలి జట్టు చేతిలో ఓడిపోయేందుకే టీ20 వరల్డ్‌ కప్‌లో వెళ్లారా? అని జట్టుపై మండిపడ్డారు. తదుపరి మ్యాచ్‌ ఆదివారం పాకిస్తాన్‌ నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇందులో పాక్‌ ఓడితే ప్రపంచ కప్‌ నుంచి వైదొలిగినట్లే.