NationalNews

భారీ అగ్ని ప్రమాదం… 700 దుకాణాలు దగ్ధం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇటానగర్‌లోని నహర్లగున్‌ డెయిలీ మార్కెట్లోని సుమారు 700లకు పైగా దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాణసంచా పేలుడు ద్వారానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఫైర్‌ సిబ్బంది ఆలస్యంగా రావడంతో మరింత మంటలు దుకాణాలకు వ్యాపించాయి.  దుకాణాలు కాలి బూడిదవడంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని దుకాణాల యజమానులు కోరుతున్నారు.