కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆరే…!
కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారన్నారు ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేటీఆర్, ఐదేళ్లకు గానీ… పదేళ్లకు గానీ సీఎం కావొచ్చన్నారు. ఆయన కుమారుడిగా కాదు… నాలెడ్జ్ పరంగా… పరిపాలన దక్షతలోనూ, కమిట్మంట్ విషయంలోనూ కేటీఆర్‌కు తిరుగులేని వ్యక్తి అని.. సీఎంగా కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు. తెలంగాణాను అభివృద్ధి చేయాలన్న తపన కేటీఆర్‌లో ఉందన్నారు. కేటీఆర్ రేపే సీఎం అవుతారని చెప్పడం లేదన్న ఆయన… కేసీఆర్ తర్వాత వంద శాతం కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పారు. అందుకే మనుగోడును కేసీఆర్ దత్తత తీసుకుంటే ఎంతో అభివృద్ధి అవుతుందన్నారు.
