ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ ప్రీ బుకింగ్ షురూ
ఆసుస్ కంపెనీ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ సరికొత్తగా “ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెట్” ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ అని చెప్తున్న దీని ధరను రూ.3,29,990 గా నిర్ణయించింది. అయితే ఈ ల్యాప్‌ట్యాప్‌ను యూజర్లు కోనుగోలు చేసేందుకు వీలుగా ప్రీబుకింగ్స్‌ను కూడా మొదలు పెట్టింది. అక్టోబర్ 14 నుండి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్ చోసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55వేల వరకు తగ్గింపును అందిస్తోంది. వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తోందని తెలిపింది. అయితే ఈ జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది. ఆసుస్ ఇండియా ఆఫిషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. 17.3 అంగుళాల థండర్ బోల్డ్ 4కే డిస్ప్లే , 12.5 అంగుళాల ఫోల్డ్ స్కీన్ , 12వ జనరేషన్ ఇంటేల్ కోర్ ఐ7 ప్రాసెసర్ , ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ , 5 ఎంపీ ఏఐ కెమెరా , డాల్ఫీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ , నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ లాంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి.