ఏపీ సీఎస్ సమీర్‌శర్మకు హార్ట్ సర్జరీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అనారోగ్యానికి గురయ్యారు. గుండె సంబంధిత అనారోగ్యంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన స్వల్ప అనారోగ్యానికి గురికాగా చికిత్స తీసుకున్నారు. అయితే ఇది గుండెకి సంబంధించింది కావడంతో శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పటల్‌లో చేరారు. అక్కడి వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో హస్పటల్ నుంచి డిస్చార్జ్ అయిన తర్వాత సీఎస్ సమీర్‌శర్మ విధులకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.