Andhra PradeshNews

ఎన్నికల పొత్తుల గురించి కానే కాదు.. ప్రజాస్వామ్యం కోసమే…!

ప్రజాస్వామ్యం బతకాలంటే రాజకీయపార్టీలుండాలి. రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తులనే నలిపేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్… మిత్రపక్షమైన బీజేపీపైనే కేసులు పెట్టారన్నారు. ఢిల్లీ పెద్దలకు తిరుపతి లడ్డూలు ఇచ్చి… ఇక్కడేమో కత్తులతో పేగులు బయటకు తీస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోకుంటే ఇక ఎవరూ మిగలరన్నారు పవన్ కల్యాణ్. పార్టీ అధినేతలపైనే అడ్డగోలుగా కేసులు పెడుతుంటే సామాన్యుల పరిస్థితేంటన్నారు. ప్రజలకు, వ్యాపారవేత్తలకు భరోసా ఎలా ఇవ్వాలన్నదానిపై చంద్రబాబునాయుడితో మాట్లాడామన్నారు పవన్ కల్యాణ్. అందరినీ కలుపుకుని వెళ్తామన్నారు. ఇప్పుడు తాము ఎన్నికలకు సంబంధించిన అంశం మాట్లాడలేదని… ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏం చేయడం లేదన్నారు. ప్రజాస్వామ్యమే ఖూనీ అవుతున్నప్పుడు ఎన్నికల ప్రస్తావన ఇంకెందుకన్నారు. ఎన్నికలు-పొత్తుల గురించి ఆలోచించలేదని.. మద్దతు తెలపడానికి మాత్రమే చంద్రబాబు వచ్చారని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సందర్భంలో జనసైనికులు, అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టి, బైండింగ్ కేసులు పెడితే తెలంగాణ నుంచి సైతం నేతలు ఫోన్ చేసి పరామర్శించారని… చంద్రబాబు సానుభూతి తెలియజేయడానికి వచ్చారన్నారు.