News Alert

మేఘన ఎమోషనల్ పోస్ట్

నటి మేఘన తన భర్త చిరంజీవి సర్జా జయంతి సందర్భంగా చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారింది.” హ్యాపీ బర్తడే మై హ్యాపీనెస్! నా సంతోషానికి కారణం ఎవరు , ఏంటి అనేది కాదు. అలాగే ఒకటి రెండు కారణాలు అసలే కాదు. కేవలం నువ్వే. నీ వల్లే నేను నవ్వుతున్నాను. మై డియర్ హస్బెండ్ చిరు… ఐ లవ్ యూ” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ , ఫాలోవర్స్ కూడా భావోద్వేగానికి లోనయ్యి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

మిమల్ని చూసి ఆయన ఆత్మ గర్వపడుతుంది మేడం. మీరు నిజంగా గొప్ప భార్య అంటూ మేఘనను ఉద్దేశించి కామెంట్లు పెట్టారు. కాగా చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశారు. ఆ సమయంలో అప్పటికే ఆమె గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చారు. తన కొడుకుకి రాయల్ రాజ్ సర్జాగా పేరు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.