వెన్నెలగా వస్తున్న కీర్తి.. ఫస్ట్ లుక్ అదుర్స్
కీర్తి సురేష్ బర్త్‌డే సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ దసర ’లోని లూక్‌ను మూవీ టీం విడుదల చేసింది. నేచురల్ స్టార్ నాని హీరోగా , కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం దసరా. ఈ మూవీలో వెన్నెల పాత్రలో కీర్తి నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కీర్తి పెళ్లి కూతురి గెటప్‌లో డ్యాన్స్ స్టేప్స్ వేస్తూ కనిపించింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. SLV క్రియేషన్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ , సముద్ర ఖని , జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులలో బీజీగా ఉంది.