పురుషులతో సమానంగా ఏడుసార్లు గెలిచారు…
మహిళల ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళలు విజేతగా నిలిచారు. తాజాగా ఉమెన్స్ టీం గెలవడంతో ఇప్పటి వరకు ఆసియా కప్‌లో మొత్తం 7 సార్లు కప్‌ను గెలుచుకున్నట్టయ్యింది. ఇండియన్ మెన్స్ జట్టు కూడా ఇప్పటివరకు 7 సార్లు ఆసియా కప్‌ను గెలుచుకొంది. టీమ్ ఇండియా గెలవడంతో క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట పండుగ చేసుకుంటున్నారు. మహిళల తాజా విక్టరీతో రెండు టీమ్స్ సరిసమానమయ్యాయి. మెదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆరంభంలోనే భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. ప్రత్యర్థులను తమ బౌలింగ్‌తో 65 పరుగులకే చుట్టేసిన ఇండియా..ఆపై బ్యాటింగ్‌లోనూ తన సత్తా చాటింది. లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.