News Alert

నిమిషాల్లో ఇడ్లీ ఇచ్చే ఏటీఎం

ఆరోగ్యం బాలేని తన కుమార్తెకు ఇడ్లీ తీసుకొచ్చేందుకు వెళ్లిన తండ్రికి నిరాశే మిగిలింది. ఎంత ప్రయత్నించిన ఇడ్లీలు దొరకక పోవడంతో ఎంతో నిరాశకు గురైనా తండ్రి ఆలోచన నుండి వచ్చిన యంత్రమే ఈ “ఇడ్లీ ఏటీఎం”. 2016లో బెంగుళూరుకు చెందిన శరణ్ హిరేమఠ్ కంప్యూటర్ ఇంజినీరుగా పని చేసేవాడు. ఒక రోజు తన కుతురికి జ్వరం వచ్చిన రోజు సమయానికి ఇడ్లీలు దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నాటి నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఇడ్లీలు అవసరమైనవారికి లభించాలన్న ఆలోచనతో ఈ పరికరాన్ని రూపొందించాడు. స్నేహితులు సురేష్ , చంద్రశేఖర్ సహాయంతో ఈ యంత్రాన్ని రూపొందించారు.

ఇడ్లీలు వండటం , ప్యాకింగ్ , సరఫరా అన్ని యంత్రమే నిమిషాల్లో చేసే విధంగా దీనిని తయారు చేశారు. కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు చేసే విధంగానూ , పొడి , చట్నీలనూ విడివిడిగా ప్యాక్ చేసి అందించేలా దీనిని సృష్టించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వచ్చిన మెనూ ప్రకారం ఆర్డర్ ఇస్తే… మిగితా పనులన్నీ అదే చక చక చేసేస్తుంది. దీని బిల్లును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. ప్రస్తుతం బెంగుళూరు బన్నేరుఘట్ట రహదారిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.