News Alert

స్టార్టప్‌లో అందరి మెప్పులు పొందుతున్న వార్తికా

చదువుకుంటూనే స్టార్టప్ ప్రారంభించి అందిరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది వార్తికా సింగ్. ఇంతకీ ఎవరి వార్తికా సింగ్?  అసలు ఆమె ఏమి స్టార్టప్ స్టార్ట్ చేసిందో తెలుసుకుందాం రండీ.. వార్తికా సింగ్‌ది బిహార్. డిగ్రీ విద్యాను అభ్యసించేందుకు హరియాణాలోని ఫరీదాబాద్‌కు వచ్చింది. అక్కడే తన ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తోంది. అయితే సొంతంగా వ్యాపారం చేయటమనేది తన లక్ష్యం.  తన డిగ్రీ చేతికి వచ్చే సిరికి ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది. బీటెక్ పూర్తై… పట్టా పొందేవరకు వేచి చూడడంలో అర్థం లేదని గ్రహించింది. అప్పటి వరకు సమయం వృథా చేయడం ఎందుకు అని తనను తాను ప్రశ్నించుకుంది.

ఈ ప్రశ్నకు సమాధానంగా వచ్చిన జవాబుతోనే ముందుకు అడుగులు వేసింది. ఇక ఒక్క క్షణం కూడా అలస్యం చేయకుండా తన లక్ష్యం వైపుగా ప్రయాణం చేయడం మెదలుపెట్టింది. ఫరీదాబాద్ గ్రీన్ ఫీల్డ్ వద్ద టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. దానికి బీటెక్ చాయ్‌వాలీ అని పేరు కూడా పెట్టింది. అలాగే తాను చేస్తున్న ఈ పనిలో ఎప్పుడు తన లక్ష్యాన్ని మర్చిపోకుడదు అని “’ఆత్మవిశ్వాసం , కృషి ఎప్పుడూ విజయాన్నే ఇస్తాయి ” అనే కొటేషన్‌ను స్టాల్ దగ్గర ఓ బ్యానర్‌లో పెట్టుకుంది. రోజూ కాలేజీ పూర్తి అయిన అనంతరం 5:30 గంటల నుండి 9 వరకు టీ విక్రయిస్తోంది. ఆమె దగ్గర టీ మాత్రమే కాకుండా లెమన్ , మసాల చాయ్‌ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె చివరిగా ఒక అభ్యర్థన కూడా చేసింది. “ఈ వీడియోను షేర్ చేసి , వైరల్ చేయకండి.

దాని వల్ల ఏమీ ప్రయోజనం రాదు. ఇక్కడకు వచ్చి , ఒకసారి టీ తాగి చూడండి. నచ్చకపోతే మళ్లీ రావద్దు అంటూ  తన పనిని కొనసాగిస్తోంది. అతి చిన్న వయస్సులోనే ఆమెకు ఉన్న పట్టుదల , సూదీర్ఘమైనా లక్ష్యం దానిని సాధించాలనే ఆమె ప్రయత్నం చూసిన వారు నెట్టింట తనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కొందరు ఆమె వీడియోకు “మీ ఆత్మవిశ్వాసం మెప్పిస్తేందని రాసుకొచ్చారు. ఇలాగే ముందుకు వెళ్తు ఉండండి త్వరలోనే మీరు కూడా ఓ బ్రాండ్‌గా మారిపోతారని” మరొకరు రాసుకొచ్చారు. ఉద్యోగాలు రాలేదని కొందరు , ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యామని మరికొందరు అత్మహత్యలు చేసుకుంటున్న ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది వార్తికా.