మునుగోడు పోలింగ్ కేంద్రాల పరిశీలన
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు, మసీదుగూడెం, పెద్దకొండూరు, చౌటుప్పల్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, తంగడపల్లిలలోని పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ ఎన్నికల పరిశీలకుడు పంకజ్‌కుమార్ ఇవాళ సందర్శించారు. ఆయన పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్‌ఛైర్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సహాయ రిటర్నింగ్ అధికారి పార్థసింహారెడ్డి, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, చౌటుప్పల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బాణాల రాంరెడ్డి, సెక్టార్ ఆఫీసర్ ప్రేమ్‌కుమార్, బీఎల్‌వోలు, పోలీసులు అధికారులు ఆయన వెంట ఉన్నారు.