మునుగోడు ఉపఎన్నిక బరిలోకి టీడీపీ
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మునుగోడు ఉపఎన్నికలనే చెప్పాలి. ఈ ఉపఎన్నికలు దేశ,రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారాయి. దీని కోసం పార్టీలన్నీ వరుస ప్రచారాలతో చాలా బిజీగా ఉన్నాయి. తెలంగాణాలోని ప్రజాప్రతినిధులు తమ ప్రత్యర్థులపై పరస్పర విమర్శలు చేస్తూ.. ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ కూడా ఈ ఉపఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మునుగోడు ఉపఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సివుంది. దీంతో మునుగోడు ఉపఎన్నికలలో పార్టీల మధ్య పోటి మరింత రసవత్తరంగా మారనుంది.