NationalNews Alert

హారతి ఇస్తున్న సమయంలో గుండెపోటు..

ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి స్టేజిపైనే ప్రాణాలు కోల్పోయిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రాంలీలాలోని శివుడి పాత్రను పోషిస్తోన్న వ్యక్తికి హారతి ఇస్తున్న సమయంలో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. నాటకాన్ని వీడియో తీస్తున్న కొందరు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందకు దీనిని చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే హారతి ఇస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్టు తెలుస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే గుండెపోటుకు సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఇటువంటి వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.