మొట్ట మొదటిసారి అంతరిక్షంలో మూవీ షూటింగ్
అందరికి సినిమాలు అంటే చాలా ఇష్టం. కొందరికి వీటిపై ఉన్న ఆసక్తి వేరే దానిపైనా ఉండదు. తమకు నచ్చిన స్టార్ సినిమా రీలీజ్‌కి సిద్ధం అవుతుందంటే చాలు టికెట్ల కోసం క్యూలలో గంటల తరబడి నిలబడి మరి సినిమా చూస్తారు. చిత్ర పరిశ్రమల్లో ఇప్పటికే చాలా రంగాలు ఉన్నాయి. కానీ హలీవుడ్ సినిమా అనగానే మనకు వెంటనే భారీ బడ్జెట్ , గ్రాఫిక్స్ గుర్తొస్తుంటాయి. ఇప్పటివరకు తీసిన హలీవుడ్ సినిమాల్లోని అంతరిక్ష సన్నివేశాలు సెట్స్‌లో షూట్ చేసినప్పటికి రియల్ ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే హలీవుడ్ హీరో టామ్ క్రూజ్ మాత్రం తన నెక్ట్స్ సినిమాలో నిజమైన అంతరిక్షంలోకి వెళ్లి నటించనున్నాడు.దీనికి ,బంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా కోసం నాసా , స్పేస్ ఎక్స్ సహాయాన్ని కూడా తీసుకోబోతున్నట్టు తెలిసింది. చిత్ర పరిశ్రమలోనే మొదటిసారి ఈ విధంగా అంతరిక్షంలోకి వెళ్లి సినిమా తీయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. భూమి మీద యాక్షన్ సినిమాలు తీసే సందర్భంలోనే ఎన్నో సమస్యలు ఎదురైతుంటాయి. కొన్ని సార్లు హీరోలకు గాయలయ్యాయి అన్న వార్తలు కూడా వింటుంటాం. వరి అంతరిక్షంలో యాక్షన్ సినిమా తీయడం ఎంత కష్టంమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా గానీ షూటింగ్ పూర్తి చేసుకొని తెరపైకి వస్తే హలీవుడ్ సినిమా పరిశ్రమ…సినిమా రంగంలోనే ఓ పెద్ద మైలురాయిని సొంతం చేసుకుంటుందనే చెప్పోచ్చు.