News AlertTelangana

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు

హైద‌రాబాద్‌లో మరోసారి భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. రెండు రోజుల క్రితం రూ. 2.5 కోట్ల నగదు పట్టుబడగా.. ఈరోజు రూ. 3.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పీఎస్ పరిధిలో ట్యాంక్ బండ్ హోటల్ మారియట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల హవాలా డబ్బును నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గండి సాయికుమార్ రెడ్డికి వెంక‌టేశ్వ‌ర్ అనే వ్య‌క్తి రూ. 3.5 కోట్ల న‌గదు ఇచ్చాడు. ఆ న‌గ‌దును సైదాబాద్‌లో ఉండే బాలు, మ‌హేంద‌ర్‌కు ఇవ్వాల‌ని సూచించాడు. ఇదే స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకుని త‌నిఖీలు నిర్వ‌హించారు. 3.5 కోట్ల రూపాయల న‌గ‌దుతో పాటు రెండు కార్ల‌ను, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.