చుండూరు కాంగ్రెస్ ఆఫీస్ దగ్ధంపై రేవంత్ ఫైర్
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో చుండూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో చుండూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు దగ్ధం అయ్యింది. దీంతో టీపీసీసీ ఛీఫ్ రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు ఇటువంటి దుష్టచర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని రేవంత్రెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ,బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని రేవంత్రెడ్డి హెచ్చరించారు.

