NewsNews AlertTelangana

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఖాయం

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అధికార పార్టీ పెట్టే  ప్రలోభాలకు ప్రజలు లొంగరని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి తెలంగాణాకు ద్రోహం చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణా ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెరాస నుంచి భారాసగా పార్టీని మార్చారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ అహంకారాన్ని దెబ్బతీసేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరు ఎన్నిరకాలుగా ప్రజలను ప్రలోభ పెట్టిన ఈ సారి మునుగోడులో బీజేపీ జెండా కచ్చితంగా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. అయితే నిన్న మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దీనికి  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్‌చుగ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో రాష్ట్రంలోని బీజేపీ బలగాలు మునుగోడులో తమ గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నాయి.