Andhra PradeshNews Alert

భారీ వర్షాల కారణంగా సాగర్ 8 గేట్లు ఎత్తివేత

తెలుగు రాష్ట్రాలల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలకు వరద నీరు ఉద్రృతంగా పెరింగింది. ఎగువన కురుస్తున్న వర్షలతో కృష్ణ నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీని కారణంగా శ్రీశైలం 2 గేట్లు ఎత్తి నాగర్జున సాగర్‌కు నీటిని వదులుతున్నారు. దీంతో సాగర్‌కు 1,12,803 క్కూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ 8 గేట్లు ఎత్తి 1,22,354 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా..ప్రస్తుతం దాని నీటిమట్టం 589.70 అడుగులు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.