జక్కన్నకు తారక్ బర్తడే విషేస్..
డైరెక్టర్ రాజమౌళి బర్త్‌డే సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు జక్కన్న! నీకు అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని రాసుకోచ్చారు. కాగా రాజమౌళి , ఎన్టీఆర్ మధ్య గట్టి బంధం ఉందనే చెప్పాలి. రాజమౌళి తన తొలి సినిమా స్టూడెంట్ నెం.1 ని తారక్ తోనే తీశాడు. ఆ సినిమా మంచి హిట్ సాధించగా.. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహాద్రి , యమదొంగ , RRR మూవీలు రికార్డులు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.