విడాకులకు విడాకులు… ఐశ్యర్య, ధనుష్ నిర్ణయం
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా సాక్షిగా ఈ జనవరిలో ప్రకటించారు. 18 ఏళ్ల వివాహబంధం ముగింపు పలికినట్టుగా ఇద్దరూ చెప్పుకొచ్చారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్‌లలో పేర్లను సైతం మార్చుకున్నారు. దీంతో ఇద్దరూ వీడిపోయారని అందరూ భావించారు. ఐతే తాజాగా వీరిద్దరూ విడిపోలేదని తమిళనాడుకు చెందిన కొన్ని వెబ్ సైట్లు పెద్ద ఎత్తున వార్తలు రాస్తున్నాయ్. విడాకులను రద్దు చేసుకోవాలనుకుంటున్నట్టుగా వారిద్దరూ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు రజనీకాంత్ ఇంట్లో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా సమస్య పరిష్కారమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో ధనుష్ ట్విట్టర్ ఖాతాలో విడాకులకు సంబంధించిన మేసేజ్ పోస్ట్ చేశారు. 18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా కలిసున్నామని… ఇద్దరం ఇప్పుడు వేర్వేరుగా జీవించాలని నిర్ణయించుకుంటున్నామని రాసుకొచ్చాడు. మా నిర్ణయాన్ని గౌరవించాలని… ప్రస్తుతం కొంత ప్రైవసీ కావాలంటూ నోట్ పెట్టారు. ఐతే నేటికీ ఆ ట్వీట్ ను మాత్రం ధనుష్ ఇంకా తీసివేయలేదు. తాజాగా వస్తున్న వార్తలపై అటు ధనుష్ గానీ, ఇటు ఐశ్వర్య గానీ ఎవరూ రియాక్ట్ కాలేదు. కానీ రజనీకాంత్‌కు సంబంధించిన సినిమా ఇష్యూలను ధనూష్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.


