పవన్ స్టార్ గాడ్ ఫాదర్ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
నిబద్ధతకు, నిజాయితీకి మారు పేరు పవన్ కల్యాణ్
రాష్ట్రాన్ని ఏలుతాడేమోనంటూ హాట్ కామెంట్స్
కచ్చితంగా నా పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తా…
తమ్ముడితోనే ఇక రాజకీయాలన్న బిగ్‌బాస్
మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి
“ఇప్పటి వరకు నా మద్దతు నా తమ్ముడికే అని స్ట్రాంగ్‌గా చేయలేదు. ఫ్యూచర్లో ఏం చేస్తానో తెలియదు. కచ్చితంగా ఆయన నా తమ్ముడు. తన నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ చిన్నప్పట్నుంచే తెలుసు. అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదు. అంతటి నిబద్ధత ఉన్న నాయకుడు మనకు రావాలి. ఏ పక్షాన ఉంటారు… ఎటుంటారు.. ఎలా ఉంటారన్నది భవిష్యత్‌లో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి వాళ్లు రావాలనే నా ఆకాంక్ష.. దానికి డెఫినెట్‌గా నా సోపర్ట్ ఉంటుంది. నేనోపక్కన.. తనో పక్కన ఉండటం.. కంటే నేను.. విత్ డ్రా చేసుకొని సైలెంట్ అయిపోవడమే… తను ఎమర్జ్ అవుతాడు.. ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడవుతాడు.. ఏమో.. ఏలే అవకాశం ప్రజలు తనకు ఇస్తారేమోనని భావిస్తున్నాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నా.. ” మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ సమయంలో పై వ్యాఖ్యలు చేశారు.

రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి చేసిన ట్వీట్ పై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు చిరంజీవి స్పందించారు. ఆ డైలాగులు విని ఎవరైనా భూజాలు తడుముకుంటే తాను చేసేదేం లేదన్నారు. భవిష్యత్‌లో తమ్ముడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు తన మద్దతుంటుందన్నారు. ఏపీకి అంకితభావం ఉన్న నేత అవసరమని… పవన్ కల్యాణ్‌కు ప్రజలు అవకాశమిస్తారన్నారు. పవన్ కల్యాణ్ నిబద్ధత ఉన్న వ్యక్తి అన్న చిరంజీవి.. అలాంటి వాళ్లు రాజకీయాలు చేయాలన్నారు. అందుకే పవన్ కల్యాణ్‌కు తన సపోర్ట్ ఉంటుందన్నారు. పరిపాలించే అవకాశం కూడా భవిష్యత్‌లో ప్రజలు ఇస్తారనుకుంటున్నానన్న చిరంజీవి… అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానన్నారు. చిరంజీవి తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చకు తావిస్తోంది. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి… కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అయిష్టంగా.. అధికారం కోసం కొందరు సరిపెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్. నిజంగా పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం వెనుక చిరంజీవి ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నేలమట్టాన్ని దగ్గరగా చూసిన చిరంజీవి.. పవన్ కల్యాణ్ మంచి కోరి.. బీజేపీవైపు అడుగులు వేసేలా చేశారా అన్న మీమాంశ కలుగుతోంది. నాడు రాజకీయంగా పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. బీజేపీ, టీడీపీ అలయన్స్‌కు మద్దతు పలికి.. కూటమి గెలవడంలో తాను కీలకమన్న అభిప్రాయం కలిగించారు. ఇలా రాజకీయంగా ఒక మెట్టు పవన్ కల్యాణ్ ఎదగడంలో చిరంజీవి ప్రోత్సాహం కూడా ఉందనుకోవాలా? అన్న అభిప్రాయం చిరంజీవి తాజా కామెంట్స్ తో కలుగుతోంది. ఇటీవల కాలంలో అటు పపన్ కల్యాణ్, చిరంజీవి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న వసూళ్లు రాబట్టడం లేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత, సైరా విజయంతో చిరంజీవి దూకుడు మీదు ఉన్నారనుకుంటున్న తరుణంలో వచ్చిన ఆచార్య సక్సెస్ కాకపోవడంతో… పవన్ కల్యాణ్ భారీ బడ్జెట్ చిత్రాలు సైతం అనుకన్న వసూళ్లు రాబట్టలేదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీలు సంచలనం సృష్టిస్తాయని పవన్ అభిమానులు భావించారు. కానీ అంతగా ఆ మూవీలు సక్సెస్ కాలేదు. ఐతే తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీని అందరూ ఓన్ చేసుకునేలా చిరంజీవి ప్లాన్ చేస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ అభిమానులు.. ఆయన సినిమా కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఎప్పుడూ కూడా పవన్ కల్యాణ్ గురించి.. తన సినిమా రిలీజ్ సందర్భంగా చిరంజీవి పొడిగిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను ఆకాశానికెత్తారు చిరంజీవి. అంటే చిరు సినిమాపై పవన్ ఫ్యాన్స్ ప్రత్యేక దృష్టితో చూస్తారన్న అభిప్రాయం ఉందేమోననిపిస్తోంది. దీని వెనుక అటు సినిమా.. ఇటు రాజకీయం రెండూ ఉన్నాయనుకోవాల్సి ఉంటుందా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఒకవేళ సినిమాలు వర్కౌట్ కాకుండా.. పూర్తి స్థాయిలో తమ్ముడి జనసేనలో చిరంజీవి సైతం యాక్టివ్ రోల్ పోషిస్తారేమోనన్న అనుమానం కలుగుతోంది.