NationalNews

కారులో 6 ఎయిర్‌ బ్యాగులు ఉండాల్సిందే..

కారులో 6 ఎయిర్‌ బ్యాగులు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ నింబంధనను కఠినంగా అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కార్ల వేరియంట్లు, ధరలతో సంబంధం లేకుండా ప్రతి కారులో 6 ఎయిర్‌ బ్యాగులు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనను ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని కేంద్రం జనవరిలో ఆదేశించింది. అయితే.. సరఫరాలో పరిమితులు, ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితుల వల్ల అమలును వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ తెలిపారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ సంస్థ మాజీ చైర్మన్‌ సైరన్‌ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో ఆయన వెనుక సీట్లో కూర్చున్నా మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమగ్ర అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ముందు సీట్లలో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా ప్రమాదం బారిన పడకుండా సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది.