గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
ఏపీలో త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవులకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అభ్యర్థులను బుధవారం ప్రకటించింది సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ ను, ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల నియోజకవర్గం అభ్యర్థిగా పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి ని, కర్నూలు కడప అనంతపురం జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా వెన్నపూస రవిని పోటీలో నిలపనున్నట్లు సజ్జల ప్రకటించారు.