పెంటగాన్‌లో భారత విదేశాంగ మంత్రికి ఘన స్వాగతం
అమెరికాలో జైశంకర్‌కు ఘనస్వాగతం
చైనా టార్గెట్‌గా ఇరుదేశాల మధ్య చర్చలు
ఇండో-పసిఫిక్ భాగస్వామ్యంపై చర్చలు
చైనాను కట్టడి చేయాలన్న లక్ష్యం
అమెరికాతో ద్వైపాక్షిక చర్చల కోసం అమెరికా వచ్చిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు, ఆ దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ జె ఆస్టిన్ పెంటగాన్‌లో ఘన స్వాగతం పలికారు. జైశంకర్ పెంటగాన్‌కు వచ్చినప్పుడు ఆయనకు గౌరవప్రదమైన కార్డన్‌ను నిర్వహించారు. ఇద్దరు నేతలు తొలుత తైవాన్ జలసంధిలో చైనా కవ్వింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల కోసం ఇండియాతో కలిసి అమెరికా పనిచేస్తోందని చెప్పారు. ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్‌కు అందించడంపై తీవ్ర విమర్శలు చేసిన జైశంకర్.. ఆ మరుసటి రోజు అమెరికా రక్షణ మంత్రితో భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకొంది. పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాల వల్ల అమెరికన్లకు పెద్దగా ప్రయోజనం ఉండదని… ఈ చర్య వల్ల ఒనగూరేదేమీ కూడా ఉండదన్నారు జైశంకర్. ఇండో-పసిఫిక్ భాగస్వాములతో కలిసి, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ కోసం అమెరికా, భారతదేశంతో కలిసి పనిచేస్తోందన్నారు రక్షణ మంత్రి ఆస్టిన్.
భారతదేశం-అమెరికా రక్షణ సహకారం ఇండో-పసిఫిక్ ప్రాంతంలని దేశాల్లో స్థిరత్వం, భద్రత, శ్రేయస్సును కాపాడతాయన్నారు జైశంకర్. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా సహకరించడంపై మండిపడ్డారు అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్. రష్యా క్రూరమైన దండయాత్రలకు చైనా మద్దతునిస్తూనే ఉందని ధ్వజమెత్తారు. అందుకే ఇండో-పసిఫిక్ రీజియన్ శాంతి, భద్రత కోసం ఇండియాతో కలిసి పనిచేస్తామన్నారు. ఇండో-పసిఫిక్ భాగస్వామ్యం వర్ధిల్లేందుకు కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా జైశంకర్, అమెరికాకు భరోసా ఇచ్చారు. భారతదేశం పట్ల అమెరికాకు ఉన్న నిబద్ధతపై విదేశాంగ మంత్రిగా జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా-రష్యా మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ గుర్తుచేశారు.
పెంటగాన్‌లో ఆతిథ్యం ఇవ్వడానికి సంతోషిస్తున్నానన్న ఆస్టిన్… రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిపిన చర్చల్లో ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. రెండు దేశాల భాగస్వామ్యానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో కంటే మరింత సన్నిహితంగా పనిచేయడానికి, సమన్వయం చేయడానికి అమెరికా, భారతీయ మిలిటరీలను సన్నద్ధంగా ఉంచాలన్నారు. పాకిస్తాన్‌కు f-16 ఫైటర్ జెట్లను ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆమోదం తెలపడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. $450 మిలియన్లు విలువ చేసే అంటే 3,660 కోట్ల రూపాయలు ఖరీదు చేసే F-16 ఫైటర్ జెట్ ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహగం వ్యక్తం చేసింది. పాకిస్తాన్, ఇండియా వ్యవహారాలుగా మొత్తం పరిణామాలను చూడబోమని… రెండు దేశాలు అమెరికాకు భాగస్వాములని చెప్పుకొచ్చారు రక్షణ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్.

