నవరాత్రి దేవీరూపాలను ఎలా ఆరాధించాలి
భారతదేశంలో స్త్రీలను గౌరవించడం అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీని శక్తిస్వరూపిణిగా, ఆదిశక్తి రూపంగా, కోరికలు తీర్చే ఇలవేల్పుగా భావించి పూజిస్తారు. ఆ శక్తి స్వరూపాన్నే దుర్గామాతగా భావిస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు కూడా ఆ ఆదిశక్తిని పూజించి తరించినవారే. అలాంటి అమ్మలగన్న అమ్మ పండుగ దసరా పండుగ. హిందూమతంలో సంవత్సరానికి నాలుగు నవరాత్రి పండుగలు జరుపుకుంటారు. అన్నింటిలోనూ శరన్నవరాత్రులది ప్రత్యేకస్థానం..
ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబరు 26 నుండి ప్రారంభం కానున్నాయి. ఇవి అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ప్రారంభమై విజయదశమి రోజున ముగుస్తాయి. వీటిని నవరాత్రి అంటారు. అంటే తొమ్మిది రాత్రులు, పది రోజులు. రేపు ఆదివారం నాడు మహాలయ అమావాస్య. సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం. ఈ నవరాత్రులలో అమ్మవారిని రకరకాల పేర్లతో పూజిస్తారు. ఎనిమిదవరోజైన దుర్గాష్టమి, తొమ్మిదవ రోజైన మహర్నవమి, పదవరోజైన విజయదశమిలను ఈ నవరాత్రులలో ముఖ్యమైన పండుగలుగా చెప్పుకోవచ్చు. అమ్మవారిని నవరాత్రులలో ప్రతిరోజూ ఒక పేరుతో ఆరాధిస్తూంటాము.

నవరాత్రి ఆరాధన:
26 సెప్టెంబర్ (1వ రోజు) – దేవీ శైలపుత్రి
27 సెప్టెంబర్ (2వ రోజు) – దేవీ బ్రహ్మచారిణి
28 సెప్టెంబర్ (3వ రోజు) – చంద్రఘంట
29 సెప్టెంబర్ (4వ రోజు) – మాత కూష్మాండ
30 సెప్టెంబర్ (5వ రోజు) – స్కందమాత
అక్టోబర్ 1 (6వ రోజు) – కాత్యాయని మాత
అక్టోబర్ 2 (7వ రోజు) – మాత కాళరాత్రి
అక్టోబర్ 3 (8వ రోజు) – మహాగౌరి
అక్టోబర్ 4 (9వ రోజు) – మాత సిద్ధిదాత్రి
అక్టోబర్ 5 (10వ రోజు) – దుర్గాదేవి (విజయదశమి లేదా దసరా)