‘గాడ్ ఫాదర్’కు యూ/ఏ సర్టిఫికేట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా తెలిపాడు. ఈ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రమోషన్స్ అప్పుడే మొదలయ్యాయి. అక్టోబరు 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిరు కూడా భాగస్వామ్యం అవుతున్నాడు. సెన్సార్ సభ్యులు సానుకూలంగా స్పందించారని, ప్రేక్షకుల ఆదరణ కూడా లభిస్తుందని భావిస్తున్నానని మోహన్ రాజా చెప్పారు.

మెగాస్టార్ ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలిపారు. భారత చిత్ర పరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ థార్ మార్ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. థార్‌మార్ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.