సౌదీ మదీనాలో బంగారమే బంగారం
సౌదీలోని పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలను కనుగొన్నట్టుగా సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో బంగారు ఖనిజాన్ని కనుగొన్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. మదీనాలోని వాడి అల్-ఫరా ప్రాంతంలోని అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాలలో కూడా రాగి ఖనిజాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచానికి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాల కోసం వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నట్టు సౌదీ స్వాగతం పలుకుతోందని ట్విట్టర్లో ఆ దేశ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

అల్ అరేబియా నివేదిక ప్రకారం, కొత్త ఆవిష్కరణలు… స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని భావిస్తోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి.. బంగారు నిల్వలు ఊతమిస్తాయని ఆ దేశం భావిస్తోంది. కొత్తగా కనుగొన్న సైట్ 4,300 కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చడంతోపాటుగా… 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బంగారు గనుల నిక్షేపాలు సౌదీ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తోందని ఆ దేశం భావిస్తోంది. సౌదీ అరేబియాలో దాదాపు 5,300 నిక్షేపాలున్నాయని… సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ ఈ జనవరిలో వెల్లడించారు. నిధుల్లో మెటల్, నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు, రత్నాలు ఉన్నాయని భావిస్తున్నట్టు నాడు ఆయన ప్రకటించారు.

క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ రూపొందించిన విజన్ 2030 ప్రకారం మైనింగ్ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టాలన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. అల్ అరేబియా ప్రకారం, జూన్‌లో, క్రౌన్ ప్రిన్స్ పరిశోధన, అభివృద్ధి రంగానికి జాతీయ ప్రాధాన్యతలను ప్రకటించారు. మేలో, రాజ్యం పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ మైనింగ్ రంగంలోకి $32 బిలియన్ల పెట్టుబడులు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 2 లక్షల 60 వేల కోట్ల రూపాయలు సౌదీలో పెట్టుబడుల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు.

