కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చిరంజీవి
నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదంటూ ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి కామెంట్ చేసిన 24 గంటలు గడవకముందే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్రవిభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న చిరంజీవికి హస్తం పార్టీ ఝలక్ ఇచ్చింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదన్న కారణంతో ప్రస్తుతం ఆయనకు ఆ పార్టీ పీసీసీ డెలిగేట్ అంటూ ఓ ఐడీ కార్డ్ ఇష్యూ చేసింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం సిద్ధమవుతున్న పార్టీ… ప్రతినిధులకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తోంది. దీంట్లో భాగంగా చిరంజీవికి ఓ ఐడీ కార్డ్ విడుదలయ్యింది. 2027 అక్టోబర్ వరకు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి డెలిగేట్ అంటూ పేర్కొంది.