కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న బ్రహ్మస్త్ర..ఒకేసారి 10 రికార్డ్‌లు బ్రేక్
రణ్‌బీర్ కపూర్,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ యాక్షన్ చిత్రం బ్రహ్మస్త్రం. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదట్లో పర్వాలేదనిపించింది. కానీ వీకెండ్స్‌లో మాత్రం ఊహించని విధంగా కలెక్షన్స్‌లో దూసుకుపోతుంది. దీంతో ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక సతమవుతున్న బాలీవుడ్‌కు ఇది కొంత ఊరట ఇచ్చినట్లే కన్పిస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమా వీకెండ్ వసూళ్లలో ఇప్పటి వరకు ఉన్న 10 సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. అవేంటంటే ఈ సినిమా ముందుగా హీరో రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అలియాభట్ సినిమాలు గంగుభాయి కాఠియావాడి,కళంక్ వీకెండ్ వసూళ్ళను కూడా ఈ సినిమా క్రాస్ చేసింది. హీరో రణ్‌బీర్ కపూర్‌కి మాత్రమే కాకుండా హిరోయిన్ అలియాభట్ కెరీర్‌లోనూ.. ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమా ఈ ఏడాది వచ్చిన కార్తిక్ ఆర్యన్ భూల్ బాలయ్య-2 మూవీ రికార్డులను కూడా బ్రేక్ చేసింది. ఇక రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లోనే అత్యధిక వీకెండ్ గ్రాసర్‌గా కూడా ఈ బ్రహ్మస్త్రం మూవీ నిలిచింది. మరోవైపు ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్‌లో హాలీవుడ్ చిత్రాలను అధిగమించింది. బ్రహ్మస్త్రం దేశవ్యాప్తంగా కరోనా తర్వాత అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి సినిమాగా ఉంది. విదేశాల్లోనూ భారీగా కలెక్షన్స్ రాబట్టిన మొదటి బాలీవుడ్ చిత్రంగా బ్రహ్మస్త్రం ట్రెండ్ సెట్ చేసింది. కాగా వీకెండ్ ఓపెనింగ్‌లో రూ.100కోట్లు వసూలు చేసిన బాలీవుడ్ సినిమాగా బ్రహ్మస్త్రం నిలిచింది. చివరిగా హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విజయం సాధించి రికార్డులు సృష్టిస్తోంది.

