జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు
జ్ఞానావాపి మసీదు వివాదంపై ఎట్టకేలకు వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయప్రాంగాణంలోని శృంగార గౌరి ప్రతిమలకు పూజల విషయంలో హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. ఈ నేపథ్యంలో వారణాసి కోర్టు హిందూ సంఘాల పిటిషన్ను విచారణకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా ఈ పిటిషన్ విచారణను స్వీకరించింది . అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ను వారణాసి కోర్టు కొట్టివేసింది.ఈ మేరకు వారణాసి కోర్టు ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
వారణాసి కోర్టు జడ్జ్ అజయ్ కృష్ణ ఈ తీర్పును వెల్లడించారు. గతంలో శృంగార గౌరి ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఓ ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను కొట్టివేయాలని అంజుమన్ ఇంతజామియా కమిటీ నేతృత్వంలో ముస్లిం సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. తాజాగా వారణాసి కోర్టు వారి పిటిషన్ను కొట్టి వేసింది.

