News

ప్రభుత్వ లాంఛనాలతో రేపు కృష్ణంరాజు అంత్యక్రియలు

రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చేవెళ్ల మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్ హౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున గుండెపోటుతో కృష్ణంరాజు మృతి చెందారు. కృష్ణంరాజు మృతి పట్ల టాలీవుట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ దగ్గర్నుంచి సామాన్యుల వరకు కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి కృష్ణంరాజు సేవలను నేతలు కొనియాడరు. ఇక సినీ ఇండస్ట్రీ మొత్తం కృష్ణంరాజు ఇంటికి తరలివచ్చి నివాళి అర్పించింది. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.