News Alert

కృష్ణంరాజు మరణవార్తతో తల్లడిల్లిన కృష్ణ

రెబల్ స్టార్‌ కృష్ణంరాజు మరణంపై సూపర్ స్టార్ కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. 50 ఏళ్ల స్నేహం మాదంటూ గుర్తు చేసుకున్నారు. మొట్టమొదట తేనె మనసులు మూవీ ఆడిషన్స్‌కు ఇద్దరం కలసి వెళ్లామని కృష్ణ గుర్తు చేసుకున్నారు. తేనె మనసులు మూవీతో నేను ఎంట్రీ ఇస్తే… చిలకా గోరింక సినిమాతో కృష్ణంరాజు పరిచయమయ్యాడన్నారు. ఆ తర్వాత “నేనంటే నేనే” సినిమాలో తనతో కలిసి కృష్ణంరాజు విలనిజాన్ని పండించారన్నారు. ఇంద్రభవనం, యుద్దం,ఇలా చాలా చిత్రాల్లో కలిసి నటించామని అని గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణంరాజు కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి తెలిపారు.