మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి ఖరారు
మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. స్రవంతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేసినట్టుగా పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం కృష్ణారెడ్డితోపాటు, స్రవంతి పలువురు బీసీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మునుగోడులో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎవరికివ్వాలన్నదానిపై మల్లగుల్లాలుపడింది. స్థానికంగా టికెట్ పంచాయితీ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకొంది.


