Telangana

గణేశ్ నిమజ్జనం కోసం రేపు మూడు జిల్లాల్లో సెలవు

తెలంగాణాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్రప్రభుత్వం రేపు శుక్రవారం నాడు సెలవుదినంగా ప్రకటించింది. మూడుజిల్లాల పరిధిలో ఇది వర్తిస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు దినానికి బదులుగా నవంబరు 12 వ తేదీ (రెండవ శనివారం) పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.