NationalNews

తమిళనాడులో దారుణం

తమిళనాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే హైకోర్టు న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. మద్రాసు హైకోర్టు లాయర్‌ను దుండగులు నరికి చంపారు. గత కొంత కాలంగా మద్రాసు హైకోర్టు న్యాయవాదిగా స్వామినాథన్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా బంధువుల పెళ్ళికి హాజరయ్యారు. స్వామినాథన్ పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో   బైక్‌లపై వచ్చిన దుండగులు కత్తులతో  నరికి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ దర్యాప్తులో భాగంగా  పాతకక్షల కారణంగా హత్య జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.