నెల్లూరు జిల్లా ZPHSలో విషాదం
నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం చోటు చేసుకుంది. వింజమూరు ZPHSలో 7 వ తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం బాలికను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బాలిక హఠాణ్మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరౌతున్నారు. అయితే బాలిక హఠాణ్మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది.