NationalNews

పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన కామెంట్‌

ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇటీవల పాకిస్థాన్‌తో భారత్‌ ఆడే మ్యాచ్‌లోకనిపించకపోవడంపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ హఫీజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2014 ఆసియా కప్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో అఫ్రిదీ రెండు వరుస సిక్సర్లు బాదాడని, ఈ కారణంగానే అశ్విన్‌ను పాకిస్థాన్‌తో ఆడే మ్యాచ్‌ల్లో ఇండియా టీంలోకి తీసుకోవడం లేదని హఫీజ్‌ అభిప్రాయపడ్డాడు. అందుకు తాను అఫ్రిదీకి థ్యాంక్స్‌ తెలుపుతున్నానని వెల్లడించాడు. 2014 ఆసియాకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్‌ టీం లక్ష్యఛేదనలో శుభారంభం అందుకుంది. ఇక చివరి ఓవర్లో పాక్‌ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, అఫ్రిది రెండు వరుస సిక్సర్లు బాదడంతో పాక్‌ ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. అయితే..  ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని హఫీజ్‌… పై విధంగా కామెంట్‌ చేశాడు.