కాబూల్‌లో భారీ పేలుడు
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. అయితే ఇది ఆత్మహుతి దాడి అని తెలుస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమైంది. కాబూల్‌లో రష్యా ఎంబసీని లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి ఈ ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ దాడిలో ఇద్దరు దౌత్యవేత్తలు మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన దాదాపు 20 మంది పౌరులు మృతిచెందారు. ఈ దాడిలో వందలాది మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఆత్మహుతి దాడితో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కొద్దిరోజులుగా పాలిత ఆఫ్ఘనిస్తాన్ లో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

