జనసేన -వైసీపీ మధ్య ఘర్షణ
విజయవాడలోని రాయల్ హోటల్ దగ్గర జనసేన , వైసీపీ పార్టీ మధ్య ఘర్షణ నెలకొంది. జనసేనకు సంబంధించిన దిమ్మకు వైసీపీ రంగులు వేశారని ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది. అసలే పవన్ కళ్యాణ్ బర్తడే సెలబ్రేషన్‌లో ఫాన్స్ అందరు పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. జనసేన దిమ్మకు వైసీపీ రంగులు వేయడం.. అంతేకాక దానిని తొలగించారని అరోపిస్తూ ధర్నాకు దిగారు. దీనిని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భాగంగా జనసేన నాయకుడు పోతిన మహేష్‌ను పోలిసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.

