Andhra PradeshNews

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆరా ఫౌండేషన్

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించటానికి యువకుల్లోని ప్రతిభను గుర్తించటానికి ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మద్దిరాల గ్రామం కేంద్రంగా గత నెల రోజులుగా రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో గుంటూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుండి అనేక జట్టులు పాల్గొన్నాయి. గత నెల రోజులుగా ఎంతో స్నేహపూర్వక వాతావరణం లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో దర్శికి చెందిన జట్టు, ఆరా ఫౌండేషన్ టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. బుధవారం ఈ రెండు జట్టుల మధ్య మద్దిరాల గ్రామంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ అనంతరం గెలిచిన జట్టులకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 75 వేల రూపాయలు, మూడో బహుమతిగా 50వేల రూపాయలు, నాలుగో బహుమతిగా 25వేల రూపాయలు ఆయా జట్టులకు ఆరా ఫౌండేషన్ తరపున ముఖ్య అతిథులు అందజేయనున్నారు. బహుమతులు ప్రదానం చేయడానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ హాజరవుతారని ఆరా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.