అలీ ఇంట మొదలైన పెళ్లిసందడి..
ప్రేక్షకులను తన కామీడీ టైమింగ్‌తో కడుపుబ్బ నవ్వించి, అతి తక్కువ సమయంలోనే మోస్ట్ టాలెంట్ కమేడియన్‌లలో ఒకడిగా అలీ నిలిచారు. బాల్యంలోనే సినిమాల్లోకి అడుగు పెట్టారు. ప్రతీ సినిమాలో తనదైన నటనతో ప్రజల మెప్పును పోందారు. డైరెక్ట్‌ర్లు కూడా ఒక సినిమా మొదలవుతుందంటే.. అలీ పాత్రను ముందుగానే నిర్ణయుంచుకునేవారు. దాదాపు అందరు హీరోలతో నటించిన అతి కొద్ది మందిలో అలీ ఒకరు. దాదాపు 1000 చిత్రాలకుపైగా నటించిన ఆయన సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆటు సినిమాల్లోనే కాకుండా బుల్లి తెరపై జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా అలీ పెద్ద కూతురు ఫాతిమా రెమీజున్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఫాతిమా రెమీజున్‌కు ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ జరిగింది.

ఈ వీడియోలను ఆలీ భార్య తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీలోని సన్నిహితులతో పాటు సీనియర్ హస్యనటుడు బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ నటులు కూడా హాజరయ్యారు. ఆలీ కాబోయే అల్లుడు ఎవరు.. ఏంటో.. తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. అయితే.. అలీకి కాబోయే అల్లుడు ఒక డాక్టర్ అని తెలుస్తోంది. అతని ఇంట్లో వాళ్ళు కూడా అందరూ డాక్టర్ ఫీల్డ్ కు సంబంధించిన వాళ్ళే కావటం విశేషం. అలీ కుమార్తె కూడా డాక్టరే. తమ కుటుంబం మొత్తంలో మొదటి డాక్టర్ తన కూతురే కావడం ఎంతో ఆనందకరమైన విషయమని అలీ పేర్కొన్నారు.