NationalNewsNews Alert

అటల్ బ్రిడ్జ్ .. అద్భుత నిర్మాణ శైలి

అటల్ బిహారీ వాజపేయ్ పేరిట సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే అద్భుతంగా నిర్మించిన బ్రిడ్జిని ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇది గుజరాత్ వాణిజ్య రాజధానిగా పేరుపొందిన అహ్మదాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఇది దాదాపు 300 మీటర్ల పొడవు 14 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్వీట్ చేస్తూ, ఈ బ్రిడ్జ్ వల్ల సబర్మతి తీరానికి ఎంతో అందం చేకూరుతుందని పేర్కొంది. దీనిని గాలిపటం ఆకృతిలో అద్భుతంగా నిర్మించారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు. ఇది గొప్ప ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు.

కాగా ఇదే బ్రిడ్జ్ గురించి జీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేసారు. మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఇది అద్భుతమైన నివాళి అని, అభివృద్ది చెందుతున్న భారతదేశం యొక్క మౌలిక సదుపాయాల రంగంలో ఈ బ్రిడ్జ్‌కి ప్రత్యేక స్థానం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ వంతెన నదికి ఒకవైపున ఉన్న పూల తోటలను, మరొక వైపున ఉన్న కళలు, సంస్కృతి కేంద్రాలను కలుపుతుంది. దీనికి ఆకర్షణీయమైన  LED లైటింగ్ కూడా అమర్చబడింది.