NationalNews

డెలవరీ బాయ్స్‌గా భారీ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు..

అప్పట్లో ఎదైనా తినాలనిపిస్తే వెంటనే ఇంట్లో వండుకుని తినే వాళ్లం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..? వంట చేయడానికి సమయం సరిపోకపోతే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. 10 నిమిషాలలోనే ఇంటి ముందు భోజనం రెడీగా ఉంటుంది. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్‌లైన్‌లో కిరాణా ఆర్డరింగ్, ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేటి అవసరం అలాంటిది. ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసి.. ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారు. కరోనా కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. దీంతో వంట చేసే టైమ్ ఉండటం లేదని ఆన్‌లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. పండగల సీజన్ కూడా వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల పండుగలు కూడా ఎవరూ జరుపుకోలేదు. కోనుగోళ్లకు కూడా గిరాకీ తగ్గింది. ప్రస్తుతం కొవిడ్ పీడ లేకపోవటంతో అన్ని ఆఫీసులు పున:ప్రారంభం కావటం, పరిస్థితులన్నీ చక్కబడటం వల్ల ఈ సారి కోనుగోళ్లు బాగుంటాయని అంచనా.

అందుకోసం పాట్‌టైమ్ ఉద్యోగాల నియామకాలను భారీఎత్తున చేపడుతున్నారు. పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలో కొనుగోలుదార్లకు డెలివరీ చేయటానికి ఎక్కువ మంది డెలవరీ బాయ్స్ ఆవసరం ఉన్నందున పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారు. నెల రోజుల్లోగా 75,000 మంది పాట్‌టైమ్ ఉద్యోగులను తీసుకుంటామని లాజిస్టిక్స్ డెలివరీ కంపెనీ తెలిపింది. వీరిలో 50,000 మందిని సరుకులను చేరవేసే ఎజెంట్లుగా,10,000 మందిని కాంట్రాక్టుపై,15,000 మందిని డెలివరీకి సిద్దంగా ఉంచామని తెలిపింది.