మృతురాలి కుటుంబానికి 10 లక్షలు సాయం
నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు హాజరైన ఓ మహిళ అకస్మాత్తుగా మృతి చెందింది. మృతురాలిని దేవరపల్లి గ్రామానికి చెందిన సమ్మెట రామమాణిక్యంగా గుర్తించారు. జగ్ సభలో ఆమె అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రామమాణిక్యం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలియడంతో మృతురాలి కుటుంబానికి వెంటనే 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు.. మృతురాలి సొంతూరు దేవరపల్లి వెళ్లిన మంత్రి జోగి రమేశ్ మాణిక్యం డెడ్‌బాడీకి నివాళులర్పించి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు.
