NewsTelangana

ప్రభుత్వ పాఠశాలల్లో.. డిజిటల్ బోధన

ఇంతకముందు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎవరికైనా గుర్తొచ్చేది మాత్రం అక్కడ ఉండే లోటుపాటులు మాత్రమే. ఈ లోటుపాటులు అనేవి బోధన పరంగా కావొచ్చు లేదా పాఠశాలలో ఉండే సౌకర్యాలకు సంబంధించినవి కూడా కావొచ్చు. ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం బోధనలో నూతన విధానాలను అవలంబించేందుకు మొగ్గు చూపుతున్నాయి. దీనికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. దీంతో కార్పోరేట్ విద్యాసంస్థలలో అందబాటులో ఉండే డిజిటల్ తరగతులు ఇక్కడ క్రమంగా విస్తరిస్తున్నాయి.

హైదరాబాద్ ,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 2513 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 26 వేల తరగతులు వరకు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోని అన్నీ ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కంప్యూటర్ ,ప్రొజెక్టర్‌తో కలిపి కే-యాన్‌లను కూడా అందించింది. వీటిపై ఉపాధ్యాయులకు అంతగా అవగాహాన లేకపోవడం వల్ల కొన్ని పాఠశాలల్లో వీటిని వినియోగించడం లేదు. దీంతో వీటికి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవి కాస్త మూలన పడ్డాయి. వీటిని ముఖ్యంగా సైన్స్ ,గణితంలో వివిధ అంశాలను బోధించేందుకు వినియోగిస్తారు. కే-యాన్స్‌తో డిజిటల్ పాఠాలు చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్.రోహిణి తెలుపారు. మరోవైపు మనఊరు..మన బడిలో ఎంపికైన పాఠశాలలకు తప్పకుండా ఈ డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.