NRI లకు ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్
ఆదాయపు పన్ను పోటు చాలా బాధగా ఉంటుంది. సంపాదించిన జీతంలో ఏడాదికి 2 నెలల జీతం INCOME TAX రూపంలో మార్చి నెలలో పోవడం చాలామంది ఉద్యోగులకు తెలిసిందే. అయితే విదేశాల్లో సంపాదిస్తూ పన్ను కట్టే ఇండియన్స్‌కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్. అదేటంటే ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేసే విషయంలో పన్ను చెల్లింపుదారులు ఇంతవరకూ ITR ఫారమ్ 67ను దాఖలు చేసేవారు. అయితే కొత్తగా 1962లోని 128 వ నిబంధనలను సవరించింది CBDT. దీనిప్రకారం గడువుతేదీలోపు ITR దాఖలు చేస్తే అసెస్మెంట్ ఇయర్ ముగిసేలోపు భారతదేశం వెలుపల చెల్లించిన పన్నులకు క్రెడిట్‌ను క్లయిమ్ చేయవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన అన్ని ఫారిన్ క్రెడిట్ క్లెయిమ్‌లకు కొత్త నియమం ప్రయోజనం చేకూరుస్తుంది. ముందుగా సవరించిన నియమం ప్రకారం, ఆదాయ పన్ను రిటర్న్‌ను అందించడానికి గడువు తేదీలోగా ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన అన్ని ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండేలా ఈ సవరణ చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. కొత్త నియమం 2022 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి ఆర్థిక సంవత్సరం 2021-22 కోసం ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారమ్ 67, సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను 2023 మార్చి వరకు ఫైల్ చేయవచ్చు.

