NationalNewsNews Alert

హైవేపై ఇక ఆటోమేటిక్ టోల్ చార్జ్  

పైలెట్ పథకం ప్రాజెక్ట్ ఆధారంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను తొలగించే యోచనలో కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ పథకం కొనసాగుతుందని రోడ్డు రవాణా , జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టోల్‌ప్లాజాల బదులుగా హైవేలపై ఆటోమేటిక్‌ కెమెరాలను అమర్చనున్నట్టు , వీటి సాయంతో వాహనాల నెంబర్ ప్లేట్స్ ఆటోమేటిక్‌గా టోల్ చార్జీలు కట్ అవుతాయని నితిన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన , ఆటోమేటిక్ సీసీ కెమెరాలు వాహనాల నెంబర్‌ను స్కాన్ చేసి వెంటనే ఆ వాహన దారుని వివరాలు , ఆకౌంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి చార్జీలను కట్ చేసే విధంగా వీటిని తయారుచేసినట్టు వివరించారు.

అయితే కంపెనీ నుండి వచ్చే కార్లకు నెంబర్ ప్లేట్ల విషయం మేము చూస్తామని , కానీ కొంతమంది నెంబర్ ప్లేట్లు మార్చడం జరుగుతున్న నేపథ్యంలో ఈ కెమెరాల గురించి ఆలోచించి నిర్ణయం తెలుపుతామని స్పష్టం చేశారు.