ఒకే వ్యక్తికి మంకీపాక్స్‌తో పాటు మూడు వ్యాధులు
ఒక వ్యక్తికి మూడు వ్యాధులు ఒకేసారి ఎటాక్ అయిన కేసు ఇటలీలో బయటపడింది. అవికూడా మామూలు వ్యాధులు కాదు. ఈమధ్యకాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, మంకీపాక్స్లతో పాటు భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి కూడా గురైయ్యాడు. ఆ వ్యక్తి ఐదురోజుల స్పెయిన్ పర్యటన నుండి తిరిగివచ్చాడు. గత తొమ్మిది రోజులుగా జర్వం, తల, గొంతు నొప్పులతో బాధ పడుతున్నాడు. వీటితో పాటు చర్మంపై దద్దుర్లు, గాయాలు కూడా వచ్చినట్టు అయ్యింది. దీనితో అతనిని అత్యవసర విభాగానికి తరలించి టెస్టులు చేయగా పై టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. ఇలాంటి కేసు చూడడం ఇదే మొదటిసారని వైద్యులు చెప్పారు. అతనికి అన్ని వాక్సిన్స్‌ను ఇచ్చారు. మంకీపాక్స్, కొవిడ్ నుండి బయటపడి, ఇంకా ఎయిడ్స్‌కి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యాధులు సరైన మంచి అలవాట్లు లేకనే వస్తాయని, వైద్యులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయవలసి ఉంటుందని పరిశోధకులు సూచించారు.

