‘లైగర్’ హీరోతో నిహారిక ఫైట్…
యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్, తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న నిహారిక ఎన్ఎమ్ తాజాగా ‘లైగర్’ మూవీ హీరో అయిన విజయ్ దేవరకొండతో గొడవకు దిగి ఆయనతో ఫైట్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీని కథ ఏమిటంటే నిహారిక తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో ఫన్ని వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకర్షించటమే కాకుండా, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకున్నారు. తాజాగా విడుదలైన ‘మేజర్’, ‘సర్కార్ వారి పాట’, ‘జెర్సీ’, ‘రన్ వే 34’, వెబ్ సీరీస్, ఇలా పలు క్రేజీ ప్రాజెక్టులలోని హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ల్తో కలిసి ఆమె ఫన్నిగా ప్రమోషన్ వీడియోలు చేశారు.
దీనిలో భాగంగానే తాజాగా ఆమె ‘లైగర్’ మూవీని ప్రమోట్ చేయటం కోసం రెడీ అయ్యారు. కాగా ఈ సందర్భంగా ‘లైగర్’ రౌడీ హీరో విజయ్‌తో ఫన్నిగా ఒక స్పెషల్ వీడియోని చేసి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడీయోలో మొదట విజయ్‌తో కరాటే, కిక్ బాక్సింగ్లతో ఫైట్ చేస్తూ ఆయనతో తలపడినట్లు కనిపించిన తరువాత విజయ్ సీక్స్ప్యాక్ కటౌట్ చూసి ఫీదా అయినట్లు ఎంతో ఫన్నిగా, సరదాగా వీడీయో చేశారు. అంతేకాకుండా విజయ్‌కి నత్తి ఉన్నట్లుగా ఇమిటేట్ చేసి మాట్లాడటం ఎంతగానో నవ్వు తెప్పించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడీయో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ వీడీయోపై పలువురు సెలబ్రిటీస్ స్పందిస్తూ ఈ వీడీయో చాలా ఫన్నిగా ఉందని కామెంట్స్ చేశారు. మరి కోన్ని గంటల్లో ‘లైగర్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

